Crime News: రౌడీ షీటర్ మసిఉద్దీన్ హత్య కేసును రెయిన్ బజార్ పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగిన విష్యం తెలిసిందే. మసిఉద్దీన్‌ను దారుణంగా హత్య చేసిన ఘటనతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ కేసును పరిశీలించిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకుని కేసును సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు […]
Revanth Reddy: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ పెట్టుబడులు అవసరమన్న దృక్పథంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు నేడు వెళ్లనుంది. నేటి (ఏప్రిల్ 16) నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో […]
ED Rides: హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ కంపెనీలపై ప్రస్తుతానికి ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహిస్తోంది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి. ఈ దర్యాప్తులో సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా […]
SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయిగా నేడు ఒడిశాలో నైనీ బొగ్గు గని ప్రారంభమైంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది. హైదరాబాద్ నుంచి నైనీ గనిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గని ప్రారంభం ద్వారా సింగరేణి కొత్త దిశలో ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రత్యేక చొరవ కీలకపాత్ర […]
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే మూడు సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం, తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం. ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని […]
Heat Stroke: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వడగాలులు తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో వడదెబ్బ (Heat Stroke) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను “రాష్ట్ర విపత్తు”గా పరిగణిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా మాత్రమే అందించబడుతోంది. అయితే, ఇప్పుడు […]
Wild Hearts Pub: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్ పై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పబ్‌లో అర్ధనగ్న నృత్యాలు, అసభ్యకర కార్యక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగుతున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సింగిల్‌గా వచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి, వారి […]
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం తప్పడంలేదు. దీనికి కారణం స్టేషన్ లో భారీ స్థాయిలో జరగబోయే ఆధునీకరణ పనులు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంపై విశేషంగా దృష్టి పెట్టడంతో.. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూడా ఆధునీకరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ ఆధునీకరణలో […]
Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా పలు కీలక అంశాలపై స్పందించారు. తనను జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ.. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాలకే అధ్యక్షుల నియామకం జరిగిందని, నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ చర్చలో లేదని తెలిపారు. ప్రజల ఆలోచనలు, […]
Crime News: దుబాయ్ నగరంలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మత విద్వేషం కారణంగా ఒక పాకిస్తానీ వ్యక్తిచే దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఓ ప్రసిద్ధ బేకరీలో గత శుక్రవారం చోటుచేసుకుంది. ఇక హత్యకు గురైన వ్యాకుతుల వివరాలు చూస్తే.. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్ (40) అనే వ్యక్తి దుబాయ్‌లో గత ఆరు […]