Realme 14T 5G: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అలాగే 111% DCI-P3 కలర్ గామట్ ను సపోర్ట్ చేయడం ద్వారా అత్యుత్తమ విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. దీనికి TUV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించిందని సంస్థ తెలిపింది. ఇది తక్కువ బ్లూ లైట్ విడుదలతో కంటికి మేలు చేస్తుందని తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పటిష్టమైన రక్షణను అందించగలదు. రియల్‌మీ 14T 5G లో 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. దీనితో పాటు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ మందం కేవలం 7.97mm మాత్రమే, ఇది భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. రియల్‌మీ ప్రకారం ఈ ఫోన్ 54.3 గంటల కాలింగ్, 17.2 గంటల యూట్యూబ్ వీక్షణ, 12.5 గంటల ఇంస్టాగ్రామ్ వినియోగం, 12.5 గంటల గేమింగ్ కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ సాటిన్-ఇన్‌స్పైర్డ్ ఫినిష్ తో వస్తుంది. సిల్కెన్ గ్రీన్, వైలెట్ గ్రేస్, సాటిన్ ఇంక్ వంటి రంగుల ఎంపికలో లభ్యమవుతాయి.
ఫోటోగ్రఫీ కోసం రియల్‌మీ 14T 5G లో 50MP AI కెమెరా ఉంటుంది. శబ్ద అనుభూతిని మెరుగుపరచేందుకు 300% Ultra Volume Mode అందించబడింది. ఇది సాధారణ వాల్యూమ్ కంటే మూడింతలు ఎక్కువ శబ్ద సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ రియల్‌మీ, ఫ్లిప్ కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ధర, ఇతర వివరాలు ఏప్రిల్ 25న జరగనున్న లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా వెల్లడించనున్నారు.