ఏపీ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలపై చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read Also: వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పురంధేశ్వరి ‘లోకేష్ ఎలా […]
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుబట్టారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని తెలిపారు. అక్కాచెల్లెళ్లుగా తామిద్దరం ఎన్నో విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Read Also: పదవి […]
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాగా ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం […]
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక […]
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఇప్పటివరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్‌లో ఉండగా… ఈరోజు 31 పరుగులు చేసిన గప్తిల్ 3,248 పరుగులతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. Read Also: ధోని కోసం 1,436 కి.మీ నడిచిన […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని భావిస్తున్న వేళ.. మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read Also: బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్ […]
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం పలికింది. ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుల గురించి కేబినెట్ చర్చించింది. ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల […]
ఏపీ శాసనమండలి నూతన ఛైర్మన్‌గా మోషేన్‌రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలిలో ఛైర్ వద్దకు మోషేన్ రాజును జగన్ తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం జగన్ అభినందించారు. అనంతరం మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. Read Also: కుటుంబ సభ్యులను కించపరచటం తగదు: పవన్ కళ్యాణ్ 1965, ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో కొయ్యే సుందరరావు, మరియమ్మ దంపతులకు మోషేన్ రాజు […]
రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపర్ చాహర్ న్యూజిలాండ్ […]
అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ఏపీకి సీఎం అయ్యింది చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడానికే అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు కొట్టుకుపోతుంటే మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయాలు బయటకు వస్తాయనే ఇలా తిట్టిస్తున్నారని.. ఇంకోసారి తమ నాయకుడి గురించి మాట్లాడితే […]