న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఇప్పటివరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్‌లో ఉండగా… ఈరోజు 31 పరుగులు చేసిన గప్తిల్ 3,248 పరుగులతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
Read Also: ధోని కోసం 1,436 కి.మీ నడిచిన అభిమాని
విరాట్ కోహ్లీ 95 మ్యాచ్‌ల్లో 137.9 స్ట్రైక్‌రేట్‌తో 3,227 పరుగులు చేయగా.. మార్టిన్ గప్తిల్ 111 మ్యాచ్‌ల్లో 136.64 స్ట్రైక్‌రేట్‌తో 3,248 పరుగులు చేశాడు. అయితే.. ఇంటర్నేషనల్ టీ20ల్లో గప్తిల్ రెండు సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ మాత్రం ఇంకా సెంచరీ మార్కును అందుకోలేదు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ (3,086), ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్ (2,608), ఐర్లాండ్ క్రికెటర్ స్టిర్లింగ్ (2,570), ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (2,554), పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (2,514) కొనసాగుతున్నారు.