అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ అసెంబ్లీని భూతుపురాణంగా మార్చేశారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కేటుగాళ్లందరూ అసెంబ్లీలో కూర్చున్నారని.. వైసీపీ నేతలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం జగన్ తల్లి, చెల్లి కూడా ఓ మహిళే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యపై ఇష్టానుసారంగా మాట్లాడితే పోలీసులు చర్యలు తీసుకోరా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. Read Also: చంద్రబాబు గ్లిజరిన్ […]
ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్‌లో చిరంజీవి పోస్ట్ చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం […]
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓ చర్చలో భాగంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఏపీలోని పలుచోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ మేరకు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు […]
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రావడంతో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని పవన్ కొనియాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని మోదీ గ్రహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గురునానక్ జయంతి […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాని నాని అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలను చంద్రబాబే చేశాడని బయట మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ హత్యల గురించి సభలో చర్చించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నాడో.. రంగా, మాధవరెడ్డి హత్యల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కొడాలి నాని అన్నారు. అన్ని విషయాలపై చర్చించాలని తాము చెప్తే… నా కుటుంబం గురించి […]
చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని అర్థమైందని… అందుకే భార్య పేరుతో ప్రజల్లో సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని.. ఒకవేళ అని ఉంటే రికార్డులు చూపించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలివిగల వాడు కాబట్టే.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు అని… […]
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుపై తమ వ్యతిరేకతను ప్రజలు బాహాటంగానే చూపించారని ఏపీ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యానించారు. కుప్పంలో ప్రజలు కూడా టీడీపీని వ్యతిరేకించడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పోయిందన్నారు. మండలి ఛైర్మన్‌గా తన సోదరుడు, దళితుడు మోషేన్‌రాజు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారని జగన్ తెలిపారు. Read Also: అది కౌరవ సభ.. గౌరవం లేని సభ : చంద్రబాబు ఫైర్ చంద్రబాబు, టీడీపీ నేతలు ఆడుతున్న […]
ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజంపేట మండలంలో వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు ఇరుక్కుపోయాయి. ఓ బస్సులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. మరో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్ […]
ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. […]
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 35,659 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,978కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 54 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో […]