భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏడోరోజు సందర్భంగా […]
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. […]
తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కేసీఆర్‌ను తిడితే కొందరు అభిమానులు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగుతుంటారు. కేసీఆర్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఆయనకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. Read Also: సింహంతో వేట.. జగన్‌తో ఆట మంచిది కాదు: ఎమ్మెల్యే రోజా సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని ఆరోపిస్తూ… రాజ్‌భవన్ ఎదుట సూర్యాపేటకు చెందిన టీఆర్ఎస్ […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. సింహంతో వేట.. జగన్‌తో ఆట మంచిది కాదని.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు అవమానించారని… కానీ ఇప్పుడు అదే మహిళలు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గురువారం నాడు ఎన్‌ఐఏ విస్తృతంగా సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి వారు సోదాలు జరిపారు. 2019 జూన్‌లో ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేస్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులతో పాటు ఓ పౌరుడు హతమయ్యారు. 2019 జూన్‌లో జరిగిన […]
లాక్‌డౌన్ పుణ్యమా అని దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. గత రెండేళ్లలో జనాలపై ఓటీటీల ప్రభావం పెరిగింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. అయితే 2021 త్రైమాసికంలో దేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీలపై ‘జస్ట్ వాచ్’ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీస్ రివ్యూ చేసింది. ఈ రివ్యూలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే […]
రేపిస్టులు భయపడేలా పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తోంది. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేరచట్టం-2021 బిల్లుకు బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్షణ చర్యల కోసం ఈ బిల్లును రూపొందించింది. గత ఏడాదే ఈ బిల్లుకు పాకిస్థాన్ […]
ఏపీలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతూనే ఉన్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 31,473 శాంపిళ్లను పరీక్షించగా 222 మందికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారింపబడింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,738కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా […]
బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత చలనచిత్ర రంగానికి హేమమాలిని చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Read Also: ఏపీకి ఏకైక రాజధాని అమరావతే: నటుడు శివాజీ నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న […]