ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుపై తెలంగాణ సర్కారు యూటర్న్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాగా ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం వేతనాలు పెరిగే అవకాశముండేది.
Read Also: పంజాబ్‌కు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా?: హరీష్ రావు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థల మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలు… డిప్యూటీ మేయర్ల వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.32,500కు పెంచుతూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 50 వేల జనాభా దాటిన మున్సిపాలిటీల చైర్ పర్సన్లకు రూ.15 వేల నుంచి రూ.19,500… డిప్యూటీ ఛైర్ పర్సన్లకు రూ.7,500 నుంచి రూ.9,750… కౌన్సిలర్లకు రూ.3,500 నుంచి రూ.4,550 పెంచుతున్నట్టు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల ఛైర్ పర్సన్లకు రూ.12 వేల నుంచి రూ.15,600… డిప్యూటీ చైర్ పర్సన్ల వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500… కౌన్సిలర్లకు రూ.2,500 నుంచి రూ.3,250 పెంచారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు వేతనాల పెంపు అమలుకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపుపై అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ సర్కారు కోరినట్టు సమాచారం. ఈసీ నిర్ణయం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!