పంజాబ్‌కు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా?: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? అని నిలదీశారు. సిద్ధిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయం అనే మాట తమను తీవ్రంగా బాధించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారో, లేదో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో వరి అధికంగా పండితే ఆ ధాన్యాన్ని ఆఫ్రికా దేశాలకు, ఇతర ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చని సూచించారు. వానాకాలం పంటపై రైతులకు మాటిచ్చామని, కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పామని హరీష్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!