రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం […]
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. కనీసం మాటలు కూడా రాని స్థితిలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. గతంలో చంద్రబాబును ఆ స్థితిలో ఎప్పుడూ చూడని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం చూసి ఓ చిన్నారి కూడా ఏడ్వడం ఆ వీడియోలో కనిపించింది. Read […]
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. […]
తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటలో వచ్చే ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. అయితే రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నాయని, రైతులు తొందరపడి ఆగమాగమై పంట కోయవద్దని సూచించారు. కోతలు అయిన వాళ్లు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకురావాలని సూచించారు. Read Also: సీఎం కేసీఆర్ డిమాండ్.. […]
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్‌లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి […]
ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం నుంచి ఇంకా ఉలుకు పలుకు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్తోందని.. అయితే ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పడం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై చివరి ప్రయత్నంగా తాను కేంద్రాన్ని కలవనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఢిల్లీకి వెళ్తామని, అక్కడ కేంద్ర మంత్రులు, సంబంధిత అధికారులను.. అవసరమైతే ప్రధానిని కూడా […]
పట్టణాభివృద్ధి విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకులను శనివారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మొదటి ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో గుజరాత్‌లోని సూరత్ రెండో ర్యాంకును, ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఏపీ నుంచి రెండు పట్టణాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏపీలోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచింది. టాప్-10 ర్యాంకులను పరిశీలిస్తే ఇండోర్, సూరత్, విజయవాడ, […]
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ఘటనలపై హోస్ట్ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌లో తరచుగా గొడవ పడుతున్న షణ్ముఖ్, సిరి జంటపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో వీళ్లిద్దరినీ నాగార్జున కన్సెషన్ రూంకు పిలిపించుకుని మట్లాడారు. వాష్‌రూంకి వెళ్లి తనను తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా అని ప్రశ్నించారు. నాగ్ ప్రశ్నకు స్పందించిన సిరి … ‘ఏమో సర్… […]