ఆహా ఓటీటీ వేదికగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్లు పూర్తికాగా ఇప్పుడు 8వ ఎపిసోడ్‌గా రానా ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమోను ఆదివారం నాడు ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య, రానా మాట్లాడుకున్న విషయాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య […]
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి […]
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై తాము విచారణ చేపట్టామని విజయవాడ సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. అయితే రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు తమకు ఆధారాలేమీ దొరకలేదని సీపీ స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్‌లను కేటాయించామని.. అయితే ఆయన తిరస్కరించారన్నారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని క్రాంతి రాణా మండిపడ్డారు. Read Also: తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం రాధాపై రెక్కీకి సంబంధించి తాము రెండు […]
విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం నాడు జుంబా డే నిర్వహించారు. తేజాస్ ఎలైట్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు హీరో సంపూర్ణేష్‌తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ జుంబా డ్యాన్స్ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇలాంటి ఫిట్ నెస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని, జుంబా డ్యాన్స్ […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో రాహుల్ వర్గం, సోనియా వర్గంగా నేతలు ఉంటారు తప్ప స్థానిక నేతలకు వర్గాలు ఉండవన్నారు. పార్టీలో వర్గాలు ఉన్నాయని ఎవరైనా అలా ఊహించుకుంటే వాళ్ల పొరపాటేనన్నారు. అయితే వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయని…. భావ వ్యక్తీకరణ అనేది మన […]
కరోనా సమయంలో రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ ఇండియన్ రైల్వేకు భారీ ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం టికెట్ల విక్రయాల ద్వారా రైల్వేకు రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదిలో తత్కాల్ టికెట్ల ద్వారా రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.119 కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. Read Also: వైరల్: బైకుపై హీరో లెవల్లో గన్‌తో… కట్ చేస్తే…! […]
అర్జెంటీనాకు చెందిన పుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది. జర్మన్ క్లబ్ పీఎస్‌జీ తరఫున ఆడుతున్న మెస్సీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్‌లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్‌జీ జట్టు తలపడాల్సి ఉంది. అయితే మెస్సీ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం మెస్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. […]
సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్‌గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్ […]
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడులో టీడీపీ కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ… కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని… పగతో రగిలిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అయితే తమపై వైసీపీ ఎంత కసి పెంచుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని కేఈ స్పష్టం చేశారు. Read Also: 10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50 […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు. […]