సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్‌గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్ నాయక్ తూ హో.. అంటూ పాట కూడా వీడియోకు యాడ్ చేశారు.
Before After pic.twitter.com/2A64uz9o9Z
— Mohammed Zubair (@zoo_bear) January 2, 2022
అయితే ఈ వీడియో కాస్త పోలీసుల వరకు వెళ్లింది. ఈ వీడియో చూసిన పోలీసులు ఊరికే ఉంటారా? వారి పద్ధతిలో యువకుల గురించి విచారణ చేశారు. దీంతో యువకుల ఆచూకీ కనుగొన్నారు. రోడ్డుపై ఇంత నిర్లక్ష్యంగా వెళ్లడమే కాకుండా తుపాకీ పట్టుకుని హల్‌చల్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కటాకటాల్లో వేశారు. దీంతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన వారు… గతంలో హీరోలుగా కనిపించిన యువకులు ఇప్పుడు జీరోలుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. వారికి తగిన శాస్తి జరిగిందని మరికొందరు కామెంట్లు పెట్టారు. అయితే ఈ వీడియో ఎక్కడిది? ఎప్పుడు తీశారు అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.