దూకుడుగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ బోర్డు షాకిచ్చింది. కెరీర్‌లో తన చివరి టీ20 మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడాలని గేల్ భావించాడు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డుతో కూడా పంచుకున్నాడు. అయితే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లకు వెస్టిండీస్ సెలక్టర్లు తాజాగా జట్టును ప్రకటించగా అందులో గేల్ పేరు లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్ గేల్ కోరికను […]
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి ఆకాంక్షించారు. Read Also: న్యూఇయర్ స్పెషల్: నిమిషానికి […]
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఓ నూతన పథకాన్ని ప్రకటించింది. Read Also: ఒమిక్రాన్‌కు ఉచిత పరీక్ష… లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రంలో 10వ […]
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురికావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. Read Also: డప్పుతో దరువేసిన ఎమ్మెల్యే… ఎవరో తెలుసా? తాను ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని వీడియోలో ఎమ్మెల్యే మేకపాటి తెలిపారు. తాను ప్రస్తుతం […]
సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను […]
కొత్త సంవత్సరం సందర్భంగా తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించినా మందుబాబులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read Also: హైదరాబాద్‌లో మరో భారీ […]
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్‌జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read […]
బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్‌పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు […]
ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ […]
హైదరాబాద్ నగరంలో మరోసారి మందుబాబులు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరొకరు బలయ్యారు. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన రోడ్డుప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితిన్ మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు నితిన్ బయటకు వచ్చిన సమయంలో మద్యం మత్తులో కారుతో వెనుక నుంచి శశాంక్ అనే వ్యక్తి ఢీ కొట్టాడు. Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరికొత్త రికార్డు ఈ ప్రమాదంలో నితిన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా… […]