కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడులో టీడీపీ కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ… కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని… పగతో రగిలిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అయితే తమపై వైసీపీ ఎంత కసి పెంచుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని కేఈ స్పష్టం చేశారు.
Read Also: 10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50 టికెట్.. ఎక్కడంటే?
ఏపీలో వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కేఈ అభిప్రాయపడ్డారు. గతంలో దేశంలో ఇందిరాగాంధీ గాలి వీచినప్పుడే తాను గెలిచానని కేఈ కృష్ణమూర్తి గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు కంబాలపాడుకు టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్వగ్రామం కంబాలపాడుకు వచ్చిన కేఈ కృష్ణమూర్తికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.