టీఆర్ఎస్ కోవర్టు అంటూ చిల్లర బ్యాచ్ తప్పుడు ప్రచారం: జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలు వేరైనా ఎదురుపడినప్పుడు మాట్లాడుకోవడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవలేదా అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ కోవర్టు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత పంచాయతీలు లేవని… కానీ పార్టీలోని చిల్లర బ్యాచ్ తనను మీడియా ముందుకు వచ్చేలా చేస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగిటివ్ వార్తలు రాసే వారికి ఆత్మసాక్షి లేదా అని నిలదీశారు. పీసీసీ చీఫ్ అనే వాడు పార్టీకి డ్రైవర్ లాంటి వాడని… తాము ప్యాసింజర్లు మాత్రమే అని అభిప్రాయపడ్డారు. డ్రైవర్ సరిగ్గా బస్సును నడపకపోతే యాక్సిడెంట్ అవుతుందని.. అప్పుడు డ్రైవర్‌తో పాటు ప్యాసింజర్లు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి కలిశారని… దాని గురించి సదరు యూట్యూబ్ ఛానళ్లు ఏం రాస్తాయని ప్రశ్నించారు. పార్టీని నాశనం చేస్తుంది తానా? రేవంత్ అభిమాన సంఘాలా అంటూ మండిపడ్డారు. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాలనుకుంటే ఆపేది ఎవరని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీకి తాను వెళ్లాలనుకుంటే డైరెక్టుగానే పోతానని… కోవర్టుగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే చిన్నారెడ్డి పనిచేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. అందుకే కోదండరెడ్డిని కాకుండా చిన్నారెడ్డిని కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి నియమించాడని జగ్గారెడ్డి వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 100 శాతం కోరుకుంటున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..