ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు […]
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి […]
త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రామరాజ్యాన్ని స్థాపిస్థానని శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వచ్చి చెప్తున్నాడని అఖిలేష్ వ్యాఖ్యానించారు. రామరాజ్యానికి సామ్యవాదమే మార్గమని… సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుందని […]
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి సాంకేతిక విధానం అవసరం. ఇప్పటివరకు ఇలాంటి విధానం కలిగి ఉన్న ల్యాబ్‌లు దేశంలో పుణె, హైదరాబాద్ నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా అయినా తాజాగా ఈ ల్యాబ్ ఏపీలో కూడా ఏర్పాటు కావడం విశేషం. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఆధ్వర్యంలో […]
రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్‌రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్‌లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. Read Also: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కీలక భేటీ అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ […]
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల తీవ్రస్థాయిఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాలకు ముద్రగడ రాసిన లేఖ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపింది. ఏపీలో తక్కువ జనాభా కలిగిన వర్గాల వారు అధికారం అనుభవిస్తున్నారని… ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఎప్పుడూ పల్లకి మోయడం కాదని.. మనం పల్లకిలో కూర్చునేలా […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవా నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాల కారణంగా భార్యా పిల్లలతో సహా రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణతో పాటు అతడి భార్య లక్ష్మీ, కూతూరు సాహిత్య సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. Read Also: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్ […]
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం […]
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ […]