ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది.
Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి విక్రమార్క
మరోవైపు తెలంగాణలో కరోనా నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే మాస్క్ ధరించనివారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈనెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.