జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్త. అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను తూ.గో. జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు. సాధారణంగా జనసేన కార్యకర్తలకు […]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా […]
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి […]
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్, […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్ ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క […]
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని.. కరోనా కారణంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు చేనేత కళాకారులను గుర్తించి […]
రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వేములవాడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు షుగర్ ఉందని సీక్రెట్ రివీల్ చేశారు. తాను షుగర్ పరీక్షలు చేసుకోవడం వల్ల 16 ఏళ్ల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని కేటీఆర్ తెలిపారు. దీంతో అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనకు షుగర్ ఉందని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో […]
ఈనెల 6న ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్వంలో 5కే రన్, 2కే రన్ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్ […]
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య […]
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని […]