సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులు ఓవరాక్షన్ చేసినట్లు కనిపించారు. ఏకంగా మంత్రుల వాహనాలను పోలీసులు ఆపడం వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మంత్రి పేర్ని నాని కూడా సీఎంతో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు మంత్రి కారు అడ్డంగా ఉందని.. దానిని పక్కకు తీయాలని చెప్పడంతో మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ‘నేను ఎవరో తెలుసా? నా డిసిగ్నేషన్ […]
టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దొరకడమే ప్రశ్నార్థకంగా మారింది. ఓపెనర్ల లిస్టులో రోహిత్, కేఎల్ రాహుల్, ధావన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ వంటి ప్రతిభావంతులు అందుబాటులో ఉండటంతో మయాంక్‌కు చోటు దక్కడం కష్టతరంగా ఉంది. అయితే టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరంగా ఉండటంతో శ్రీలంకతో తొలి టెస్టుకు మయాంక్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అతడు కేవలం 33 పరుగులకే వెనుతిరిగాడు. […]
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్‌లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. తొలి […]
దేశంలో ఇటీవల భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు ఎక్కువ అయిపోతున్నాయి. చాలా జంటలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే పెటాకులు అవుతున్నాయి. తాజాగా ఓ విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి శారీరక బంధాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమే అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో హైకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో తన భార్య కలిసి ఉండటం […]
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1975 నుంచి ప్రపంచంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2030 నాటికి ప్రపంచంలోని యుక్త వయసు కలిగి ఉన్నవారిలో సగం మంది అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న జనాభా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇండియాలో ఊబకాయం ప్రాబల్యం 40.3 […]
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్(52) హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు ఆస్ట్రేలియాలో మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు […]
ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం టీడీపీ అరచేతిలో స్వర్గం చూపించిందని ఆయన ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారని విమర్శలు చేశారు. రైతు ఉద్యమం పేరుతో చంద్రబాబు గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టం కూడా మోయలేదన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అన్ని […]
నియంతల కథలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వారిలో చాలా మంది జీవితం అట్టడుగు నుంచి అత్యున్నత అధికార శిఖరం ఎక్కినవారే. ప్రస్తుతం ప్రపంచాన్ని నిద్రకు దూరం చేసిన రష్యా అధినేత వ్లాడిమీర్ పుతిన్ కథ కూడా అందుకు భిన్నం కాదు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడయ్యాడు. రెండు దశాబ్దాలుగా సువిశాల రష్యాను ఎదురులేకుండా ఏలుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్నది ఆషామాషీ యుద్ధం కాదు. నాటో శక్తులన్నీ ఏకమై అవకాశం కోసం కాసుకుని కూర్చున్నాయి. […]
రెండే రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మార్మోగుతున్నాయి. ఒకటి పుతిన్.. రెండోది జెలెన్ స్కీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలుగా ఆయన రష్యాను తిరుగులేకుండా పాలిస్తున్నారు. కానీ జెలెన్ స్కీ గురించే చాలా మందికి తెలియదు. నిజానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు కావటానికి ముందు జెలెన్‌స్కీ ఒక బిజీ నటుడు. పలు సినిమాలు టీవీ సిరీస్‌లలో హాస్య పాత్రలు పోషించారు. […]
దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చేపట్టింది. భద్రత, దాని సామర్థ్యం పెంపు కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవని చెప్తున్నారు. […]