KTR: నాకు షుగర్ వ్యాధి ఉంది.. ఈ విషయం 16 ఏళ్ల క్రితమే తెలిసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వేములవాడలో పర్యటించిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు షుగర్ ఉందని సీక్రెట్ రివీల్ చేశారు. తాను షుగర్ పరీక్షలు చేసుకోవడం వల్ల 16 ఏళ్ల క్రితమే తనకు ఈ విషయం తెలిసిందని కేటీఆర్ తెలిపారు. దీంతో అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తనకు షుగర్ ఉందని చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగంగా 220 టీమ్‌లు ఇంటింటికి వచ్చి పరీక్షలు చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైట్, వెయిట్, బీపీ, షుగరు, హార్డ్, కిడ్నీ, ఇతరత్రా డేటాను అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. అక్కడే కంటి పరీక్ష కూడా చేస్తారన్నారు. అలాగే రక్ష పరీక్షలు చేస్తారని.. రాబోయే 60 రోజుల్లో పరీక్షలు పూర్తి అవుతాయన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండటం వల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని.. ఏ దవాఖానాకు వెళ్లినా డేటా క్లియర్‌గా ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read
మరోవైపు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి పరంగా దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఎవరికైనా విమర్శలు చేయడం సులభంగానే ఉంటుందని.. కానీ పనిచేసినప్పుడే చేసిన ఆ కష్టం విలువ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఎప్పుడైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చారా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?