Andhra Pradesh: చికెన్ వండలేదని చెల్లెలిని గొడ్డలితో నరికిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది.
అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాత్రి పూట ఫుల్లుగా మద్యం సేవించిన నంద.. ఇంటికి వస్తూ చికెన్ తెచ్చాడు. ఆరోగ్యం బాగోలేదని పడుకున్న చెల్లెలిని నిద్రలేపి చికెన్ వండమని బలవంతపెట్టాడు. ఆరోగ్యం బాగా లేకున్నా చికెన్ వండాల్సిందేనని హుకుం జారీ చేసి బయటకు వెళ్లిపోయాడు. అన్న బయటకు వెళ్లడంతో చెల్లెలు సోమమ్మ చికెన్ వండలేదు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన నంద.. కోడికూర వడ్డించాలని ఆర్డర్ వేశాడు. చికెన్ వండలేదని చెల్లెలు చెప్పడంతో అన్న కోపంతో ఊగిపోయాడు. గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించగా సోమమ్మ బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగెత్తింది. ఆమె వెంట పరుగెత్తిన అన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సోమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కాగా వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
తాజావార్తలు
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!