ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 15 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతోన్న వలస సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డోవాలోకి […]
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్‌గా వంటనూనెల ప్యాకెట్లను […]
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175★ […]
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు […]
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది. కాగా రాజమండ్రి వచ్చే […]
ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగానే గాయనీ గాయకులు పోటీ పడినట్టు ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే మార్చి 4, 5 తేదీలలో స్ట్రీమింగ్ అయిన 3వ ఎపిసోడ్ చూస్తే… కామెడీ ఎక్కువ కంటెంట్ తక్కువ అనే భావనే వీక్షకులకు కలిగింది. ఆహా నుండి వస్తున్న ఈ కార్యక్రమంలో గానం కంటే వినోదానికి పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తోంది. పైగా కంటెస్టెంట్స్ అందిస్తున్న వినోదం, మిఠాయిలు… న్యాయనిర్ణేతలను శాటిస్ ఫై చేస్తుండొచ్చు […]
మహారాష్ట్రలో రెండో అతి పెద్దనగరం పూణెలో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఆదివారం నాడు పూణె మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అనంతరం గర్వారే మెట్రో స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో […]
ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే […]
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంక వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ అందుకున్నాడు. దీంతో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున కపిల్‌దేవ్ 434 వికెట్లు తీసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉండగా.. తాజాగా అశ్విన్ రెండో స్థానాన్ని ఆక్రమించడంతో కపిల్‌దేవ్ మూడోస్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో […]