Ramesh Nalam
Author- NTV Telugu-
Andhra Pradesh: కేంద్రం శుభవార్త.. పోలవరం ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటన
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత […] -
IND Vs SL: తొలి రోజు ముగిసిన ఆట.. పంత్ సెంచరీ మిస్
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అంచనాల మేరకు రాణించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 స్కోరు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో […] -
Team india: విరాట్ కోహ్లీ వివాదంపై స్పందించిన రవిశాస్త్రి
బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కు ఒక వైపే చూడొద్దని.. రెండు వైపులా చూడాలని హితవు పలికాడు. సమస్యను చూస్తుంటే ముందుకు వెళ్లలేమని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అలా చూస్తే అద్భుత విజయాలు సాధించలేమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీతో తాను ఎన్నో ఏళ్లుగా ప్రయాణం చేశానని.. […] -
CM KCR: దేశాన్ని సరికొత్త పంథాలో కొత్త విధానంలో నడిపించాలి
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ […] -
Edible Oil: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనెల ధరలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరా భారీగా పడిపోయింది. సుమారు 80 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పడిపోయాయి. జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 3,07,684 టన్నులు ఉండగా.. ఫిబ్రవరిలో 1,40,000 టన్నులకు పడిపోయాయి. జనవరిలో పోలిస్తే ఫిబ్రవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుబడులు 22 శాతం పడిపోయాయి. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీగా గిరాకీ ఏర్పడింది. […] -
AP Capital: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: హోంమంత్రి మేకతోటి సుచరిత
అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్ సభను శుక్రవారం నాడు హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి […] -
Russia Ukraine War: ఎల్‌ఐసీ ఐపీవో వాయిదా
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా సిద్ధం కాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఐపీవోను వాయిదా వేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, […] -
Supreme Court: భారతీయుల తరలింపులో కేంద్రం చర్యలపై సీజేఐ ప్రశంసలు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని […] -
IND Vs SL: మరోసారి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు కోహ్లీ మీదే పడ్డాయి. అతడు సెంచరీ చేయక 833 రోజులు దాటిపోతోంది. ఈ మ్యాచ్‌లో అయినా తమ స్టార్ ఆటగాడు సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 45 పరుగులకే అవుటయ్యాడు. ఎంబుల్‌దెనియా బౌలింగ్‌లో […] -
IPL 2022: గుజరాత్ టైటాన్స్ జట్టులోకి సురేష్ రైనా?
ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ దూరమయ్యాడు. అతడిని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను […]
తాజావార్తలు
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!