Revanth Reddy: ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు.. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడని.. చెట్టుమీద కోతిలాగా, కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని మరోసారి రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని రేవంత్ పేర్కొన్నారు. 12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్‌పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ప్రస్తుతం టెంటు లేదు, ఫ్రంట్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!