కియా Syros vs మహీంద్రా XUV 3XO- SUV కొనేవారికి ఏది బెస్ట్?
- భారత్‌లో రోజురోజుకు దూసుకుపోతున్న కాంపాక్ట్ SUV..
- కియా సైరోస్, మహీంద్రా XUV 3XO మధ్య ప్రధానంగా పోటీ..
- కియా, మహీంద్రాలో ఏది ఎంచుకోవాలన్నది కస్టమర్లకు పెద్ద కన్ఫ్యూజన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ రోజురోజుకూ దూసుకెళ్తుంది. ఈ విభాగంలో కియా సైరోస్, మహీంద్రా XUV 3XO మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతుంది. రెండూ కూడా 4 మీటర్ల లోపు పొడవు, ఆధునిక ఫీచర్లు, మంచి సేఫ్టీ, ఆకర్షణీయమైన SUV లుక్‌తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక, ఫస్ట్ SUV కారును కొనాలని చూస్తున్న కస్టమర్లకు ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. మరి.. ఈ రెండు కార్ల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..
Read Also: Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు హామీ.. మీ DNA నిరూపించుకోండి.. బిలియన్ల రూపాయల సంపదను పొందండి!
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
రెండు కార్ల ధరల మధ్య వ్యత్యాసం..?
కియా సైరోస్ ధర రూ. 8.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కాస్త ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఇది నచ్చే రేంజ్ అని చెప్పాలి. ఇక, మహీంద్రా XUV 3XO మాత్రం రూ. 7,28,300 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. బడ్జెట్ ఫస్ట్ SUV కొనేవారికి ఇది మరింత అందుబాటులో ఉండే ఆప్షన్.
Read Also: Two Women’s Married:మగాళ్లంటే ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
ఇంజిన్ & పనితీరు..
Kia Syros
* 1.0 లీటర్ టర్బో పెట్రోల్- 118 bhp
* 1.5 లీటర్ డీజిల్- 114 bhp
* 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్
* సిటీ ట్రాఫిక్‌లో చాలా స్మూత్, రిఫైన్డ్ డ్రైవింగ్ అనుభూతి
Mahindra XUV 3XO
* పెట్రోల్ ఇంజిన్లు 111 bhp నుంచి 131 bhp వరకు
* 1.5 లీటర్ డీజిల్- 300 Nm టార్క్ (హైవేలో అదిరిపోయే పిక్-అప్)
* మాన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు
* ఓవర్‌టేక్‌లు, హైవే స్పీడ్‌లో మహీంద్రా మరింత దూకుడు చూపిస్తుంది
* సిటీ రిఫైన్‌మెంట్ కావాలంటే- Kia
* హైవే పవర్ కావాలంటే- Mahindra
రెండు కార్లలో తక్కువ ఖర్చులో మైలేజ్
Kia Syros
* పెట్రోల్- 18.2 kmpl వరకు
* డీజిల్- 20.75 kmpl వరకు
Mahindra XUV 3XO
* పెట్రోల్- 20.1 kmpl
* డీజిల్- 21.2 kmpl రన్నింగ్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి XUV 3XO కాస్త ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.
ఫ్యామిలీకి ఏది బెస్ట్?
Kia Syros
* 465 లీటర్ల భారీ బూట్ స్పేస్
* స్లైడింగ్ రియర్ సీట్లు (లగేజీ, లెగ్‌రూమ్ అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు)
* ఫ్యామిలీ ట్రిప్స్‌కి చాలా బెస్ట్
Mahindra XUV 3XO
* 364 లీటర్ల బూట్
* సెగ్మెంట్‌లోనే అత్యధిక వీల్‌బేస్ ఉండటం వల్ల వెనక లెగ్‌రూమ్ ఎక్కువ
* వెనక సీట్లో కూర్చునే వారికి మరింత కంఫర్ట్
అయితే, లగేజీ స్పేస్ ముఖ్యం అనుకుంటే కియా Syrosను ఎంపిక చేసుకోవచ్చు.. క్యాబిన్ లెగ్‌రూమ్ ముఖ్యం అనుకుంటే- మహీంద్రా XUV 3XO సెలక్ట్ చేసుకోవచ్చు.
ఫీచర్లు & టెక్నాలజీ?
Kia Syros ప్రత్యేకతలు
* పెద్ద డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లే
* పనోరమిక్ సన్‌రూఫ్
* వెంటిలేటెడ్ సీట్లు, అంబియంట్ లైటింగ్
* లెవల్ 2 ADAS (బ్రేకింగ్, లేన్ కంట్రోల్‌కు స్మార్ట్ సపోర్ట్)
Mahindra XUV 3XO
* డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లు
* 360-డిగ్రీ కెమెరా
* ప్రీమియం ఆడియో
* టాప్ వేరియంట్లలో లెవల్ 2 ADAS.. కాగా, కియా ప్రీమియం & ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తే, మహీంద్రా మనీకి తగ్గ ఫీచర్లతో ఎక్కువ వాల్యూ అందిస్తుంది.
సేఫ్టీలో రెండూ స్ట్రాంగ్
* రెండు SUVs కూడా 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ సాధించాయి. అలాగే, 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి ఫీచర్లతో సేఫ్టీలో రెండూ సమానంగా బలంగా ఉన్నాయి.
ఫైనల్ గా ఏది కొనాలి?
ప్రీమియం ఫీల్, సిటీ రిఫైన్‌మెంట్, భారీ బూట్, టాప్ టెక్ కావాలంటే → Kia Syros
పవర్, మైలేజ్, 360 కెమెరా, వాల్యూ ఫర్ మనీ కావాలంటే → Mahindra XUV 3XO
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!