దేశవ్యాప్తంగా RRR సినిమా ప్రభంజనం నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.750 కోట్లు వసూలు చేసినట్లు తాను తెలుసుకున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని.. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో భారత్ 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందన్నారు. అంతేకాకుండా RRR సినిమా లాగే ఇండియన్ […]
శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయిన నేపథ్యంలో నిహారిక ఆ పార్టీలో ఉండటానికి కారణం చెప్పకుండా పోలీసులు నిహారిక తప్పులేదని చెప్పారంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదం అవుతోంది. నిహారిక గురించి ‘షీ […]
ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్‌లోకి అడుగుపెట్టిన ఆ టీమ్‌కు వరుస పరాజయాలు షాకిచ్చాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో జడేజా నేతృత్వంలోని జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను తుది […]
హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని […]
హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని పబ్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. శనివారం అర్ధరాత్రి పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరి కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై […]
తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టే ఈ కార్యక్రమాలకు రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ధాన్యం కొనుగోలు అంశంపై ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో […]
ఏపీలో జిల్లాల విభజనకు సంబంధించి శనివారం అర్ధరాత్రి కొత్త నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త కలెక్టర్ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లతో నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్‌ల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో జిల్లా పరిషత్‍ల విభజన లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే […]
హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని అతడు క్లారిటీ ఇచ్చాడు. అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని అతడు వాపోయాడు. నిర్ణీత సమయానికి పబ్ మూయకపోతే నిర్వాహకులపై […]
ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో డీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను చెన్నై జట్టు తిరిగి దక్కించుకుంది. దీంతో అతడి సేవలు రవీంద్ర జడేజా నేతృత్వంలోని టీమ్‌కు […]
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రభంజనం చాటుతోంది. ఉత్తరాదిన కూడా ఊహించని రీతిలో స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. […]