Prabhas: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ప్రసంగం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యు! మొన్న జపాన్‌లో ఇలాంటివన్నీ చేశాను అంటూ లవ్ సింబల్ చూపించారు. మీకు నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్నానని అన్నారు. ఈ చలిలో ఎంతమంది వచ్చారు! ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి, జాగ్రత్త. టూమచ్ చలి ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెడదాం?
READ ALSO: Vijay Jananayagan: ఇక్కడ అవి వద్దమ్మా.. : విజయ్
అనిల్ తడాని దగ్గర నుంచి మొదలుపెడదాం. ఆయన నా బ్రదర్, బాంబేలో మన సినిమాలన్నీ చేస్తాడు. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. లవ్ యు బ్రదర్! ఐ లవ్ యు సంజయ్ సార్, మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, పెడితే మొత్తం తినేస్తారు.
ఇక ఈ సినిమాలో మా నానమ్మ ఎంత బాగా చేసిందంటే, డబ్బింగ్‌లో ఆమె సీన్స్ చూసి నా సీన్స్ మర్చిపోతున్నాను నేను. నేను మా నానమ్మకి ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ-మనవడు కథ. ఇక మన హీరోయిన్ల విషయానికొస్తే.. రిద్ది చాలా మంచి పెర్ఫార్మర్, కష్టపడి చేసింది. సినిమాకి ప్రతిసారి ఎవరు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాళవిక మంచి కళ్ళు, పొడుగు.. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. నిధి సెట్లో అందరికీ ఫేవరెట్, పాజిటివ్‌గా తన పని చేసుకుంటూ బ్యూటిఫుల్‌గా ఉంటుంది, ఇది చాలా రేర్ కాంబినేషన్. బాహుబలి సాల్మన్ మాస్టర్, ఐ లవ్ యు మాస్టర్.
నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని బాహుబలి జయహో అంటున్నారు కదా? ఎప్పుడూ ఇలాగే చేస్తున్నారు. ఒకరోజు స్టేజి మీద ఎంటర్‌టైన్ చేస్తాను, మీరందరూ షాక్ అయిపోతారు!” అంటూ ఫ్యాన్స్‌ని సరదాగా కామెంట్ చేశారు. “ఈ సినిమా హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే, ఇది అసలు మూడు సంవత్సరాలు. ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, మారుతి ఏదో చేసేసారు, ఏదో రాసేసారు. కానీ విశ్వప్రసాద్ గారు మూడేళ్లపాటు.. మేమేమైనా భయపడ్డామేమో కానీ, ఈయన మాత్రం భయపడలేదు. చిన్నప్పుడు ఏం తిన్నారు సార్? ఆ ధైర్యం ఎక్కడిది? ఏం తిన్నారో మాకు కూడా చెబితే మేము ధైర్యం తెచ్చుకుంటాం. రాజా సాబ్ కి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు!” అంటూ ప్రభాస్ ప్రశంసించారు.
READ ALSO: Prabhas: స్టేజ్ మీద గుక్క పెట్టి ఏడ్చిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్