హైదరాబాద్ రాడిసన్ పబ్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బంజారాహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పీఎస్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పబ్‌లో ఆయన టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ వ్యహారాన్ని బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుపై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ కూడా ఉంది. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ శివచంద్రను సీపీ […]
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జాతీయ అసెంబ్లీలో ఆదివారం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. మరోవైపు తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. […]
హైదరాబాద్ నగరంలో రాడిసన్ పబ్ ఘటన టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్‌లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ పార్టీకి మెగా డాటర్ నిహారిక వెళ్లిన విషయాన్ని ఖరారు […]
క్రికెట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ […]
ఏపీలో ఈనెల 11న సీఎం జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. దీంతో చాలా మంది వైసీపీ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. కేబినెట్‌లో మెజార్టీ మార్పులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్‌కు […]
చైనాలోని వూహాన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XE వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ BA2 సబ్ వేరియంట్ కంటే XE వేరియంట్ 10 రెట్లు […]
పార్లమెంట్‌లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు […]
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఉగాది పర్వదినం రోజు కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై […]
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఫోటోకు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు. శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి […]
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ఈనెల 3లోగా సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు […]