2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ […]
కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు కూడా బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చే నెల 25 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో అందరూ తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు […]
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే […]
కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ శుక్రవారం వెల్లడించింది. టీకా ఒప్పంద కంపెనీలకు సరఫరా పూర్తి కావడం, టీకాకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తగ్గడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంతో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపడతామని.. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపై దృష్టి […]
దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానం మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఏపీలో అయితే భారీగా రక్తపోటు, మధుమేహం బాధితులు పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతి 100 మందిలో ఎవరో ఒకరు ఈ రెండింటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత రాష్ట్రాల వారీగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ […]
హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. తెలుగు ప్రజలకు ఉగాదితోనే సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండగ పర్వదినం రోజు ప్రతి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడిని చేసుకుని తింటుంటారు. ఉగాది పచ్చడి చేసుకోవడంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. ఈ ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తుంది. అందుకే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా […]
శ్రీలంకలో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు […]
ఉగాది పర్వదినం రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శాంతించలేదు. పండగ వేళ అని కూడా చూడకుండా వాహనదారులకు చమురు కంపెనీలు వాహనదారులకు షాకిచ్చాయి. పెట్రోల్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ 80 పైసల చొప్పున పెరిగాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ రేట్లను పెంచడం ఇది పదో సారి. 12 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.20 చొప్పున పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో […]
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో రబాడ (15) 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఆ మాత్రం […]
★ నేడు శుభకృత్ నామ ఉగాది పర్వదినం ★ అమరావతి: నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొననున్న సీఎం జగన్.. ఉ.10:30 గంటలకు పంచాంగ శ్రవణం ★ తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.. నేటి నుంచి అంగప్రదక్షిణం భక్తులకు టోకెన్‌లు జారీ చేయనున్న టీటీడీ ★ హైదరాబాద్: నేడు ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు […]