హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసుకోవచ్చని సూచించారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రైమ్ మినిస్టర్ కప్ 2022 క్రికెట్ పోటీలను ఆదివారం మధ్యాహ్నం బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాము ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటే బేవకూఫ్ గాళ్లు అని టీఆర్ఎస్ నేతలు సంబోధించడాన్ని బండి సంజయ్ ఖండించారు. త్వరలోనే కేసీఆర్‌కు హైదరాబాద్ ఫైల్స్ చూపిస్తామని హెచ్చరించారు.
https://ntvtelugu.com/renuka-chowdary-clarity-on-her-daughter-allegations-on-pudding-and-mink-pub-case/