ఏపీ కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు అమల్లోకి రాగా.. త్వరలో మరో కొత్త జిల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో కొత్త జిల్లా […]
డర్బన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా […]
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన తమ జట్టును ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), ఆల్‌రౌండర్ దీపక్ హుడా (51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు మంచి స్కోరు అందించారు. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో […]
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు […]
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాడిసన్ హెటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా పుడింగ్ అండ్ మింక్ పబ్ లైసెన్స్‌ను, లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారా హిల్స్ పరిధిలో ఏళ్ల తరబడి రాడిసన్ హోటల్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ హోటల్‌కు […]
2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లింపుపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పాలక, నగర పంచాయతీలలో ఆస్తి పన్నును ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం తమ ఆస్తి పన్నును ఒకే సారి చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రధాని మహింద్రా రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మహింద్రా రాజపక్సతో పాటు […]
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం […]
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత […]
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం […]