Prabhas: సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ అవ్వాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, సీనియర్స్ అంటే సీనియర్సే. ఏ సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము, సీనియర్స్ తర్వాతే మేము 100% అంటూ చెప్పుకొచ్చారు. సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. సో, లవ్ యు డార్లింగ్! ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడానా? వస్తుంది, అప్పుడప్పుడు అలా వస్తుంటుంది. డార్లింగ్స్, రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటాలిటీ.. అన్నీ అందులో కనిపిస్తాయి. ఓకే డార్లింగ్, లవ్ యు సుమ!” అంటూ ప్రభాస్ తన స్పీచ్ ముగించారు.
READ ALSO: Off The Record: వైసీపీ సోషల్ మీడియా వార్ మొదలుపెట్టిందా..? కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి..?
ఇక ఈ ఈవెంట్‌లో మారుతి ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకోగా, ప్రభాస్ స్వయంగా వచ్చి హత్తుకుని ఆయనకు ధైర్యం చెప్పారు. అంతేకాక, ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ గారు కాక ఇంకెవరైనా అయితే కచ్చితంగా ఈ సినిమా పూర్తయ్యేది కాదని, ఆయనే రియల్ హీరో అని కొనియాడారు. “అంతేకాక, చిన్ననాటి నుంచి ఏం తిని పెరిగారు? మీకు అంత ధైర్యం ఎలా ఉంది? ఆ తినేదేదో మాకు కూడా చెప్పొచ్చు కదా” అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ప్రభాస్ చేసిన ఈ ప్రసంగం ఫ్యాన్స్‌లో ఒక రేంజ్ హ్యాపీనెస్‌ను తీసుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత మైక్ పట్టుకున్న ప్రభాస్, తన మాటలతో అభిమానుల ఆకలి తీర్చేశారని చెప్పాలి.