ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల […]
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తన స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీలను పెవిలియన్ […]
ఏపీలో జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలకు సంబంధించిన సమస్యలను సరిదిద్దుతామన్నారు. మరోవైపు ఏపీలో తాజా పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. జగన్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ కూడా త్వరలో శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తుందన్నారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు […]
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఈరోజు దుర్దినం అని ఆయన అభివర్ణించారు. అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ఎంత బాధపడ్డామో.. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ రెండు ఘటనలు ప్రజలకు చీకటి దినాలుగా నిలిచిపోతాయన్నారు. జిల్లాల విభజనతో వేమూరు నియోజకవర్గ ప్రజలకు తీరని నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరుకు శతాబ్దాలుగా తెనాలితో ఉన్న అనుబంధం […]
విమానయాన రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ […]
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో స్టార్ క్రికెటర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. హామిల్టన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 16 బంతుల్లో ఒక ఫోర్ సాధించి 14 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్‌కు ఇది చివరి వన్డే కావడంతో అతడు అవుట్ కాగానే స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా రాస్ […]
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిరసనలు తెలపడంతో పాటు, రాష్ట్ర నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో […]
ఐపీఎల్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్ విధ్వంసంతో పంజాబ్ జట్టు కోలుకుంది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా లివింగ్ స్టోన్ చెలరేగాడు. అంతేకాకుండా ముఖేష్ చౌదరి వేసిన ఓవర్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే పెద్ద సిక్సర్. ముంబై ఇండియన్స్ ఆటగాడు బట్లర్ 104 మీటర్ల సిక్స్ […]
హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత రెండు నెలలుగా డ్రగ్స్ విషయంలో అనేక కేసులు నమోదు చేశామని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లను కలిగి ఉన్న అన్నింటికీ మెసేజ్‌లు ఇచ్చామన్నారు. గత రాత్రి పబ్‌లో రాడిసన్ గ్రూప్ వారు అనుమతి తీసుకుని […]
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ లలితా కళాతోరణంలో ఆదివారం ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో ఆలేటి వరుణ్‌కు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అవార్డును అందించారు. తొలుత హీరో ఆలేటి వరుణ్‌ను శాలువాతో సత్కరించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అనంతరం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు, రాజకీయ నేత బాబూ మోహన్ కూడా పాల్గొన్నారు. హీరోఆలేటి వరుణ్ గతంలో […]