Ram Charan: RRR టీమ్‌కు సర్‌ప్రైజ్.. 10 గ్రాముల బంగారు కాయిన్ బహుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రభంజనం చాటుతోంది. ఉత్తరాదిన కూడా ఊహించని రీతిలో స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన మంచితనాన్ని చాటుకున్నాడు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్‌వోడీలను ఆదివారం ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించాడు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్టుమెంట్‌లో పనిచేసిన అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించాడు. వారితో కాసేపు సరదాగా సమయం గడిపిన రామ్‌చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి 10 గ్రాములు విలువ చేసే బంగారు కాయిన్ కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా వారికి కేజీ స్వీట్ బాక్స్ చొప్పున అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్‌చరణ్ ధన్యవాదాలు తెలిపాడు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశాడు.
Also Read


తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!