Vaarasudu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు టాలీవుడ్‌లోనూ క్రమంగా మార్కెట్ పెరుగుతోంది. అతడి గత చిత్రాలు ఈ విషయం నిరూపించాయి. ముఖ్యంగా మాస్టర్ మూవీ విజయ్ కెరీర్‌లో తెలుగులోనూ బెస్ట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు వారసుడు మూవీతో మరోసారి విజయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 12న విడుదల కానుంది. ఈ సాయంత్రమే ఈ సినిమా తమిళ ట్రైలర్ విడుదల కాగా తాజాగా తెలుగు […]
VeerasimhaReddy: అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు […]
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా […]
Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ అన్నారు. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి వ్యవస్థ […]
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అయితే డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ పాలన తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారని చురకలు అంటించారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడతారా అని నిలదీశారు. తనను […]
Kanna Lakshmi Narayana: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మరోసారి ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఇప్పుడు తొలగించిన వాళ్లను గతంలో తానే నియమించానని.. అధ్యక్షుల మార్పు అంశాన్ని అసలు తనతో చర్చించకపోవడం సమంజసం కాదన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమందిని పార్టీలో జాయిన్ చేశానని.. ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీని వీడుతున్నారో సోము వీర్రాజు సమాధానం […]
Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మార్కెట్ యార్డులో పెన్షన్‌లు పంపిణీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరిగేవి కాదని.. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పెన్షన్‌లు తొలగించామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ తాము పెన్షన్ పెంచి ఇస్తున్న సంగతి గుర్తించాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని లూటీ […]
IND Vs SL: టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ను అభిమానులు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అభిమానులు ఈ మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టార్ నెట్‌వర్క్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ శర్మ లేని సిరీస్‌ను ఎందుకు చూడాలని క్రికెట్ అభిమానులు భావిస్తుండటంతో ప్రకటన దారులు కూడా దూరమయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ దాదాపు రూ.200 […]
IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను చివరకు 160 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు. అతడు ఈ ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి రెండు రనౌట్లు చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతో రెండు పరుగుల […]
Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. […]