Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను […]
What’s Today: * నేటి నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్.. వైద్యులతో వర్చువల్‌గా ప్రసంగించనున్న సీఎం జగన్.. హాజరుకానున్న 100 మంది విదేశీ, 450 మంది స్వదేశీ నిపుణులు.. వివిధ రకాల వ్యాధులు, వాటి చికిత్సా విధానంపై చర్చ.. తొలిరోజు సమావేశంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ * అమరావతి: నేడు వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం * నేడు కుప్పంలో చంద్రబాబు […]
IND Vs SL: పూణె వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దంచికొట్టింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 190 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో అక్షర్ పటేల్ […]
OFF The Record: ఆయన బీజేపీలో కీలక నేత. ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తన వాగ్ధాటితో ఎదుటివారిని కట్టడి చేసే ఆయనకు.. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. అసమ్మతి పేరుతో నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు వేడి రాజేస్తున్నాయి. అదెక్కడో.. ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. దుబ్బాక బీజేపీలోని సీనియర్లు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? కాషాయ శిబిరంలో ఎందుకు కలకలం? ప్రస్తుతం టీ బీజేపీలో […]
Team India: టీమిండియాను వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ కూడా గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. దీంతో గురువారం శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ముంబైలోనే ఉన్నాడని.. రెండో మ్యాచ్ జరిగే పూణెకు వెళ్లలేదని […]
OFF The Record: ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో చేసిన కామెంట్స్‌తో ప్రస్తుత బాస్ సోము వీర్రాజుకు బాగా కాలుతోందా? అందుకే సొంత జిల్లా నేతలకు వీర్రాజు గట్టిగా క్లాస్ పీకారా? ఇంతకీ ఇద్దరి మధ్య కొత్తగా పొగ పెట్టిన అంశాలేంటి? ఏం జరిగింది? కన్నాకు గౌరవ మర్యాదలతో స్వాగతం చెప్పిన కాకినాడ జిల్లా బీజేపీ నేతలు? కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కన్నా తర్వాత ఆ పదవి సోము […]
OFF The Record: వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డున పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కే.. క్రమశిక్షణ లేదని ఆందోళనకు దిగారు. ఇంతకీ ఎందుకీ రచ్చ? వనపర్తి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి ఎర్త్ పెడుతుంది ఎవరు? చిన్నారెడ్డికి అంతకోపం ఎందుకు వచ్చింది? రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డికి అసలేమైంది? వనపర్తిలో గడిచిన కొన్నిరోజులుగా సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి.. స్థానిక […]
Gautham Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే వన్డే ప్రపంచకప్‌కు ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎందుకంటే ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడమే ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు భారత్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని సూచనలు చేశాడు. అవసరమైతే వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా ఆటగాళ్లను పక్కనపెట్టాలని సూచించాడు. ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో […]
OFF The Record: తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని కమలంపార్టీ గట్టిగా చెప్పుకొంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఢంకా బజాయిస్తున్నారు నేతలు. మరి.. క్షేత్రస్థాయిలో బీజేపీకి ఆమేరకు బలం.. బలగం ఉందా? అది తెలుసుకోవడానికే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఆ భేటీ తర్వాత క్లారిటీ వచ్చేస్తుందా? ఇంతకీ ఏంటా సమావేశం? తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్ బూత్ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్ కమిటీలు ఎంత […]
OFF The Record: ఇద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకరు ఎమ్మెల్యే .. ఇంకొకరు ఎమ్మెల్సీ. మొన్నటి వరకు కలిసిమెలిసి సాగిన నాయకులే. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య అగ్గి రేగింది. పరస్పరం ఫిర్యాదులు చేసుకునేంతగా విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం కలసి సాగాల్సిన నేతలు.. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరా నాయకులు? శృంగవరపుకోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఇదే నియోజకవర్గానికి చెందిన రఘురాజు ఎమ్మెల్సీ. ఇద్దరూ వైసీపీ నేతలే. […]