Andhra Pradesh: కొత్త ఏడాదిలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. దీంతో పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. తొలుత నెల్లూరు జిల్లా రాజకీయాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం నాడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో కోటంరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే తాను పార్టీపై […]
IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ క్రికెటర్లు అంచనాల మేర రాణించలేకపోయారు. తొలి టీ20 ఆడుతున్న గిల్, ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కేవలం 7 పరుగులకే అవుటయ్యారు. అటు తుదిజట్టులో అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ కూడా రాణించలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి మాత్రమే శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా […]
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేయగా ఇప్పుడు వీరితో బుమ్రా కూడా చేరనున్నాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన బుమ్రా.. వెన్నుకు సంబంధించిన […]
Ola Scooters: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30 శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు […]
Anam Ramnarayana Reddy: ఏపీలో జగన్ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఏడాది ముందే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియడంలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు […]
IND Vs SL: కొత్త ఏడాదిలో టీమిండియా తన ప్రయాణం మొదలు పెట్టబోతోంది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. పలువురు కొత్త ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శివం మావి, శుభ్‌మన్ గిల్ టీ20లలోకి అడుగుపెట్టబోతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఈ […]
Kapil Dev: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఆధారపడి వన్డే ప్రపంచకప్ గెలవలేమని కపిల్ దేవ్ అన్నాడు. ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడితే మెగా టోర్నీలు గెలవలేమని.. కనీసం నలుగురు లేదా ఐదుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రచించాలని కపిల్ దేవ్ సూచించాడు. ఒకవేళ కప్ గెలవాలని అనుకుంటే.. కోచ్, సెలక్టర్లు, జట్టు […]
Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్‌ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన […]
Football Player Pele: 20వ శతాబ్దంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే అందరూ పీలే పేరు చెప్పి తీరాల్సిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. పీలే మరణంపై ఫిఫా కూడా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది. అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది. […]
SomiReddy: ఏపీలో బహిరంగ సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆంక్షలు విధిస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయమని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఇవే ఆంక్షలు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో […]