Janasena Party: ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్‌లో కార్యక్రమాలు చేయలేదా అని విమర్శించారు. బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జగనే స్వయంగా జెండాలు ఊపలేదా అని నిలదీశారు. అప్పుడు ప్రజలకు కలిగిన […]
Guntur District: హిందూ శాస్త్ర ప్రకారం కొన్ని ఆలయాలకు కొన్ని మహిమలు ఉంటాయి. అలాంటి ఆలయాలను సందర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న భీమేశ్వరస్వామి ఆలయం చోళుల కాలం నాటిది. ఈ ఆలయం రెండు ప్రాకారాలుగా ఉంది. రెండో ప్రాకారంలో స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయం ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అవివాహితులకు త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం ఉంది. అంతేకాకుండా […]
KotamReddy Sridhar Reddy: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం, అధికారులపై కోటంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని సీఎం జగన్ పిలిపించగా.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్న సమస్యలనే తాను మాట్లాడానని.. తాను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారన్నారు. తన నియోజకవర్గంలో గడప గడపకు […]
Indian Railways: 2021తో పోలిస్తే 2022లో భారతీయ రైల్వేలకు భారీగా ఆదాయం సమకూరింది. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు 71శాతం వృద్ధి కనబరిచిందని రైల్వేశాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మధ్య కాలంలో కేవలం ప్రయాణికుల నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం రూ.28,569 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని […]
Team India: కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కాబోతోంది. శ్రీలంకతో టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముంబై వేదికగా తొలి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఫెంటాస్టిక్ ఫైవ్ సిద్ధమని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో చాహల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు. టీమిండియా సీనియర్ […]
Jogi Ramesh: నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో జరిగిన ఘటనపై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను ఒకచోటకు చేర్చారని.. కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని కూపన్లు ఇచ్చారు.. ఎంతమందికి పంచారో చెప్పాలన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన చూపు అని.. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట […]
Gautham Gambhir: టీమిండియా వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న వేళ టీమ్ కాంబినేషన్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ రాణించిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఇంతకంటే ఇషాన్ కిషన్ సత్తాకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించాడు. దీంతో ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సెలక్టర్లు […]
Budda Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేశారని.. చంద్రబాబు యాత్రను తప్పు పట్టే స్ధాయి కొడాలి నానిది కాదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. రాష్ట్రానికి శని ఎవరో డిబేట్‌కు తాను రెడీ అని.. కొడాలి నాని వస్తే ప్రజల్లో తేల్చుకుంటామన్నారు. గుడివాడలో ఓడిపోతామనే కొడాలి నాని ఫ్రస్ట్రేషన్‌లో […]
Minister Roja: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు మరో 11 మంది బలయ్యారని రోజా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి 40 మందిని చంపేశారని ఆగ్రహం […]
Chintamaneni Prabhakar: పోలీసుల తీరుపట్ల టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 3న తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రక్తదాన శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు చింతమనేని ప్రభాకర్ వెళ్లగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తన చొక్కా చింపివేశారని ప్రెస్‌మీట్‌లోనే చింతమనేని ప్రభాకర్ తన చొక్కా విప్పి చూపించారు. అత్యుత్సాహంతో తన చొక్కా చింపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇప్పటికే తనపై 31 […]