Constable’s Luxury Bungalow: యూపీలో కానిస్టేబుల్‌కే ఇంత పెద్ద ఇళ్లా?.. నెట్టింట లగ్జరీ బంగ్లా ఫోటోలు వైరల్!
- దగ్గు సిరప్ స్మగ్లింగ్ ఆరోపణలతో గతంలో అరెస్టైన కానిస్టేబుల్
- లక్నోలోని అతని నివాసంపై దాడులు
- ఇల్లు చూసిన ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్రాష్ట్ర కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ స్మగ్లింగ్ సిండికేట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలోని అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో బయటకు వచ్చిన అతని భవనం దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఆస్తి ప్రస్తుతం కస్టడీలో ఉన్న యూపీ పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందినదేనని అధికారులు స్పష్టం చేశారు. కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ రవాణా కేసులో అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించారు. అలోక్ ప్రతాప్ సింగ్‌కు చెందిన ఈ విలాసవంతమైన భవనం లక్నోలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతమైన సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
సింగ్ నివాసాన్ని చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక యూపీ పోలీసు కానిస్టేబుల్‌కు నెలకు సుమారు రూ.40 వేల జీతం మాత్రమే ఉంటుందని, అలాంటి పరిస్థితిలో ఇంత విలాసవంతమైన ఇల్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. “పోలీస్ కానిస్టేబుల్‌కు ఇంత పెద్ద ఇల్లు ఎలా?” అని కొందరు వ్యాఖ్యానించగా, “ఈ ఇంటిని చూసిన తర్వాత అందరూ JEE కంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకే సిద్ధం కావాలి” అంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు.
ఇదిలా ఉండగా, గతంలో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ డిసెంబర్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే అతడు సమన్లకు స్పందించకపోవడంతో ఈడీ అధికారులు అతని నివాసంపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.
Look at this mansion in Sushant Golf City, one of Lucknow’s most posh locality.
It belongs to a UP Police constable, Alok Pratap Singh, now in custody for running a cough-syrup smuggling racket. An entry level man drawing barely ₹40,000 a month, yet living in a house that even… pic.twitter.com/rN04NbuRiy
— THE SKIN DOCTOR (@theskindoctor13) December 12, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?