Chandrababu: నేను తలుచుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చేసేవాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అయితే డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ పాలన తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారని చురకలు అంటించారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడతారా అని నిలదీశారు. తనను శారీరకంగా, మానసికంగా బాధపెట్టినా తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. లోకల్ ఎమ్మెల్యేగా తనకు ప్రజలతో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైసీపీకి ఒక రూల్, టీడీపీకి ఒక రూల్ ఉంటుందా అని పోలీసులను నిలదీశారు.
Read Also: Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కు పితృవియోగం
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
సైకో సీఎం పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఆనాడు తాను తలుచుకుంటే జగన్ 365 రోజులు పాదయాత్ర చేసేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అందుకే సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ప్రజల తరఫున తాను పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. వైసీపీ సభలకు జనం వెళ్లకపోతే పెన్షన్ కట్ చేస్తున్నారని.. తన సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. అయినా రెండో తేదీన జీవో ఇచ్చి 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తన సభలకు వస్తున్న ఆదరణ చూసి జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తనను చూస్తే ప్రభుత్వానికి వణుకు పుడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీకి చిత్తశుద్ధి ఉంటే బాబాయ్‌ను గొడ్డలితో ఎవరు నరికి చంపాలో కనిపెట్టాలని అన్నారు. ఇలాంటి పనికిమాలిన దద్దమ్మ, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!