Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్ […]
Andhra Pradesh: కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ అన్నారు. గుడ్ గవర్నెన్స్ అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని.. ప్రస్తుతం ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదని విమర్శలు చేశారు. గ్రామీణాభివృద్ధికి 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను ప్రభుత్వం వేరే […]
VishnuKumar Raju: భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ సంకేతాలు పంపింది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలబోమని మరోసారి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. జనసేన పొత్తులో ఉంటే మంచిది.. లేకున్నా మంచిది అనే సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంటరి పోరుకు సిద్ధ పడాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ డైరెక్షన్ ఇవ్వనుంది. […]
Team India: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ల కిందట షమీపై అతడి భార్య హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టడంతో పాటు కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. హసీన్ జహాన్‌కు నెలవారీగా రూ.50 వేలు భరణం చెల్లించాల్సిందిగా షమీని కోర్టు ఆదేశించింది. గతంలో షమీ తనను హింసించేవాడని […]
Rayapati SambasivaRao: గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని.. తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును అడిగామని.. దీనికి టీడీపీ అధిష్టానం సమాధానం చెప్పాలని రాయపాటి అన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ ఇచ్చినా తమ రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. […]
Andhra Pradesh: మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్‌మెన్లు విశ్రాంతి తీసుకుంటుంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చాడు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్‌రూంలోకి వెళ్లాడు. దీంతో చెన్నకేశవులు ఆ తుపాకీ తీసుకుని […]
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం కోటా టోకెన్‌లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోని భక్తులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన […]
JEE Mains: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసివేస్తారు. […]
IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే […]
Team India: ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా అతడికి టీమిండియాలో చోటుదక్కలేదని పలువురు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం సెలక్టర్లపై విమర్శలకు దిగుతుండటం పలువురికి నచ్చడం లేదు. అయితే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషధ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తెలిసీ తెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్ […]