KotamReddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ వారసత్వం లేకున్నా పోరాటాలతో ఎదిగానని స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని పరోక్షంగా ఆనం, మేకపాటి కుటుంబాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా అవకాశాలు వచ్చినా ఈ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వీళ్లే అనుభవిస్తున్నారని.. ఇకనుంచి ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు. […]
IND Vs NZ: రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి వన్డే హీరో బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, […]
Guinnis Record: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గిన్నిస్ బుక్. ఈ ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉన్నా తమకంటూ ఓ ప్రత్యేకత, నైపుణ్యాన్ని కలిగి ఉంటే చాలు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించవచ్చు. ఈ గిన్నిస్ బుక్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు చేరుతూనే ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ కళాకారుడు కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. జైపూర్‌కు చెందిన కళాకారుడు నవరతన్ ప్రజాపతి మూర్తీకర్ తయారు చేసిన ఓ […]
Naga Babu: జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఉంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని నాగబాబు అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్నారు. […]
Team India: రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్‌ను 34.3 ఓవర్లలోనే 108 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ ఏం తీసుకోవాలో తెలియక అలానే ఉండిపోయాడు. రోహిత్ అంత సేపు ఆలోచించడం చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి ‘ఏం చేస్తున్నావ్ రోహిత్’ అని ప్రశ్నించాడు. అయితే చివరకు ఫీల్డింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. అయితే టాస్ సమయంలో రోహిత్ తన నిర్ణయం చెప్పడానికి కారణం పిచ్ […]
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను శుక్రవారం సాయంత్రం ప్రముఖ నగల విక్రయ సంస్థ జోయ్ అలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్ జాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో అలుక్కాస్ వర్గీస్ సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. Read Also: తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ? ఈ సందర్భంగా ఏపీలో తాము అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ జోయాలుక్కాస్ […]
Tirumala: తిరుమలలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తిరుమలలో డ్రోన్ కెమెరాలు ఎలా వినియోగించారని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరవేసినా విజిలెన్స్ విభాగం గుర్తించలేని స్థితిలో ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి […]
Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు 42 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. శుక్రవారం నాడు ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై.. ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ […]
Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు వంటి ప్రముఖులు మృతి చెందారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసీల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), […]
BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా ఈ […]