Andhra Pradesh: మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్‌మెన్లు విశ్రాంతి తీసుకుంటుంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చాడు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్‌రూంలోకి వెళ్లాడు. దీంతో చెన్నకేశవులు ఆ తుపాకీ తీసుకుని నుదిటిపై కాల్చుకుని మరణించాడు. శబ్ధం విని బయటకు వచ్చిన రామయ్య వెంటనే విషయాన్ని సుచరిత దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు విషయం తెలియజేశారు.
Read Also: Dhamaka: వీడియో సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది…
కాగా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అటు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. అయితే చెన్నకేశవులు ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం చెన్నకేశవులు ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నకేశవులు రాసిన సూసైడ్ లెటర్ పోలీసులకు లభించింది. అమ్మా.. నేను చనిపోతున్నాను నా కుటుంబాన్ని కాపాడండి అంటూ చెన్నకేశవులు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తారు చేస్తున్న పని వల్ల తన కుటుంబం, ఇద్దరు పిల్లలు అన్యాయమైపోతున్నారంటూ లేఖలో రాశాడు. తాను కేవలం ఆర్థిక ఇబ్బందులతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేఖలో వివరించాడు. తన మరణాన్ని ప్రమాదంగా భావించాలని మాజీ హోంమంత్రి సుచరితను అభ్యర్థించాడు. తన కుటుంబానికి తన మరణం తర్వాత బెనిఫిట్స్ వచ్చే విధంగా చూడాలని సూసైడ్ నోట్‌లో కోరాడు.