Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ సెకండ్ పార్ట్ ఉందా? అందుకే అలా ముగిసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్ జనరేషన్‌లో మానస్, కీర్తి భట్ లాంటి పాత్రలను ఎందుకు చూపించారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే మోనితను దీప కాల్చిన తర్వాత కారులో కార్తీక్‌తో కలిసి వెళ్తుంది. అయితే ఓ చోట ఆగమని చెప్తుంది. తాను చనిపోయేలోపు ఏడు అడుగులు నడవాలని భర్తతో అంటుంది. దీంతో కారు ఆపి ఏడు అడుగులు నడుస్తారు. ఇంతలో కారు పేలిపోతుంది. మోనిత కారులో బాంబు పెట్టిందని తెలుస్తుంది. చివరకు కార్తీక్, దీప ప్రేమతో మాట్లాడుకుని వెళ్లిపోతారు. దీంతో మళ్లీ కలుద్దాం అని ఎండ్ కార్డ్ వేశారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
కానీ గతంలో కార్తీక్, దీప కారు ప్రమాదంలో చనిపోయారని చూపించిన తర్వాత సీరియల్‌లో సెకండ్ జనరేషన్‌ను ప్రారంభించారు. శౌర్యను ఆటో డ్రైవర్‌లా, హిమను డాక్టర్‌లా పరిచయం చేశారు. వీళ్లిద్దరూ బిగ్‌బాస్ ఫేం మానస్‌ను ప్రేమించడం కూడా చూపించారు. అయితే ఉన్నట్టుండి ఆటోడ్రైవర్ వారణాసి శౌర్య, హిమ దగ్గరకు వచ్చి కార్తీక్, దీప బతికే ఉన్నారని చెప్తూ ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభిస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రీ ఎంట్రీ లేకుండా సీరియల్ ఎలా ముగిస్తారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. అయితే కొందరు కార్తీకదీపం సీరియల్‌కు సెకండ్ పార్ట్ ఉందని.. అందుకే ఇలా ముగించారని చర్చించుకుంటున్నారు. కాగా కార్తీక దీపం సీరియల్ స్థానంలో బ్రహ్మముడి అనే ధారావాహికను స్టార్ మా ఛానల్ ప్రారంభించింది.
😂#Karthikadeepam last episode pic.twitter.com/Y8i5pzh0N2
— Sun J (@99999sanjay) January 23, 2023
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!