IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. తొలి వన్డేలో కష్టపడి గెలిచిన రోహిత్ సేన రెండో వన్డేలో మాత్రం పూర్తి ఆధిపత్యం చూపించింది. మరి మూడో వన్డేలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.
Read Also: Sajjanar Twitter Hacked : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
ఈ మ్యాచ్ ఇండోర్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాటింగ్ పరంగా భారత్‌కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే మిడిలార్డర్‌లోని ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సత్తా చూపించడం లేదు. ఓపెనర్లు లేదా వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ చెలరేగితేనే భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ ఏం చేస్తుందో ఇటీవల పెద్దగా కనిపించలేదు. శ్రీలంకపై రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరి మూడో వన్డేలో ఏం చేస్తాడో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్, చాహల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి కోసం ఎవరు త్యాగం చేస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.