Shehbaz Sharif Trolled: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తుర్క్మెనిస్థాన్‌లో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. తుర్క్మెనిస్థాన్‌లో ఆయన పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాల పాటు ఎదురు చూడాలని చెప్పారు. కానీ ఆయన అధికారుల మాటలు వినకుండా పుతిన్ – ఎర్డోగన్ సమావేశం జరుగుతున్న గదిలోకి బలవంతంగా ప్రవేశించారు. ఈ సంఘటన తర్వాత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. నిజానికి గతంలో కూడా షాబాజ్‌పై ఇలాంటి ట్రోల్స్ అనేకం వచ్చాయి.
READ ALSO: Pawan Kalyan: కెప్టెన్ దీపిక వినతిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. వెంటనే చర్యలు
1. పుతిన్‌తో షెక్‌హ్యాండ్ కోసం ఉరుకులు..
సెప్టెంబరులో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు షెక్‌హ్యాండ్ కోసం షాబాజ్ షరీఫ్ వైపు వేగంగా కదులుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వచ్చాయి.
2. హెడ్‌సెట్‌తో ఆగమాగం..
సెప్టెంబర్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో షాబాజ్ షరీఫ్ ధరించిన హెడ్‌సెట్ పదేపదే చెవుల్లోంచి జారిపోయింది. దాన్ని సరిచేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కెమెరాలో రికార్డ్ అయ్యి వైరల్ అయ్యాయి.
3. ట్రంప్ ప్రసన్నం కోసం తిప్పలు..
అక్టోబర్‌లో ఈజిప్టులో జరిగిన శాంతి సదస్సులో షాబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను శాంతికాముకుడిగా, గొప్ప అధ్యక్షుడిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడిని అతిగా పొగిడినందుకు ఆయనపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వెళ్లువెత్తాయి.
4. పట్టించుకొని జి జిన్‌పింగ్..
సెప్టెంబరులో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కావాలనే షాబాజ్ షరీఫ్‌తో మాట్లాడకుండా తప్పించుకున్నట్లు ఉంది.
5. VPN వాడి దొరికిపోయాడు..
పాకిస్థాన్‌లో X ని నిషేధించినప్పటికీ షాబాజ్ ట్రంప్‌కు అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. VPN ద్వారా షాబాజ్ షరీఫ్ X ని ఉపయోగించారని ఆయనపై ఆ టైంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆ టైంలో ఆయనపై దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. జాతీయ భద్రత, చట్టాన్ని పాటించకపోవడం వంటి కారణాలతో పాకిస్థాన్ ఫిబ్రవరి 2024లో X ని నిషేధించింది.
6. ప్రధాని మోడీని కాపీ కొట్టారనే విమర్శలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 13న పంజాబ్‌లోని అడంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో కలిసి పస్రూర్, సియాల్‌కోట్ వైమానిక స్థావరాలను సందర్శించారు. ఇది ట్రోలింగ్‌కు దారితీసింది. షాబాజ్, భారత ప్రధాని మోడీని కాపీ కొడుతూ అనేక మంది పాక్ ప్రధాని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు.
READ ALSO: Hardik Pandya Gambhir Fight: హార్దిక్-గంభీర్ గొడవపడ్డారా? వైరల్‌గా మారిన వీడియో