మాజీ మంత్రి సుచరిత వైసీపీకి దూరం కాబోతున్నారా? అందుకు కారణం పార్టీపై ఆమె అసంతృప్తి అని కొందరు.. అనారోగ్యం వల్ల అని ఇంకొందరిలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తన భర్త ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటా అన్న ఆమె మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి? మంత్రి పదవి పోవడంతో అసంతృప్తిగా ఉన్న సుచరిత వేరే ఆలోచనతో ఉన్నారా? సుచరితకు నిజంగా పార్టీ మారాలన్న ఆలోచన ఉందా.. లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి పని చేస్తుందా? […]
Team India: టీమిండియాలో టీ20 ఫార్మాట్‌కు సంబంధించి ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం ఖాళీగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలను కట్టబెడుతున్నారు. అయితే అతడు ఒక్క మ్యాచ్ ఆడితే ఆరు మ్యాచ్‌లు ఆడకుండా జట్టును కష్టాల్లోకి నెడుతున్నాడు. వన్డేల్లో ఇటీవల డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే […]
IND Vs SL: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లలో మూడో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా భారత్ తరఫున టీ20లలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ సెంచరీ మార్కు అందుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్ […]
BCCI: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను […]
IND Vs SL: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనూహ్యంగా మార్పులు లేకుండానే టీమిండియా ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. ముఖ్యంగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెడతారని అందరూ ఊహించారు. కానీ వీళ్లిద్దరికీ మరోసారి […]
Gudivada Amarnath: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు కాదని.. బాలయ్య తాత అని సంభోదించారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఎవరు వస్తారని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుకున్నంత జనం రాలేదని.. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదు ఇప్పుడు వీరసింహారెడ్డి అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబు రోడ్లపై […]
IRCTC: దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుపతి, షిర్డీ, పూరీ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు అండమాన్ దీవులు వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించింది. అందమైన దీవులు చూడాలని భావించేవారికి అండమాన్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీతో ఇది ఉంటుందని వివరించింది. హేవ్ లాక్, పోర్టు బ్లెయిర్ వంటి వివిధ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. జనవరి 28 […]
Rishab Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మెరుగైన చికిత్స కోసం ఇటీవల పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగ్మెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్‌ను ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. శుక్రవారం నాడు పంత్ […]
Tulasi Reddy: ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన […]
Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని […]