OFF The Record: కన్నాకు బీజేపీ నేతల స్వాగతం.. అగ్గిమీద గుగ్గిలమైన సోము వీర్రాజు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OFF The Record: ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో చేసిన కామెంట్స్‌తో ప్రస్తుత బాస్ సోము వీర్రాజుకు బాగా కాలుతోందా? అందుకే సొంత జిల్లా నేతలకు వీర్రాజు గట్టిగా క్లాస్ పీకారా? ఇంతకీ ఇద్దరి మధ్య కొత్తగా పొగ పెట్టిన అంశాలేంటి? ఏం జరిగింది?
కన్నాకు గౌరవ మర్యాదలతో స్వాగతం చెప్పిన కాకినాడ జిల్లా బీజేపీ నేతలు?
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కన్నా తర్వాత ఆ పదవి సోము వీర్రాజుకి లభించింది. పార్టీలో ఇద్దరు ఎడ్డెం అంటే తెడ్డెం అనుకునే పరిస్థితి. వారం కిందట ఫ్యామిలీతో కలిసి కాకినాడ జిల్లాకు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. దైవ దర్శనం చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కన్నా పర్యటనలో బాగానే ఇన్వాల్వ్ అయిపోయారట జిల్లా బిజెపి నేతలు. గౌరవ మర్యాదలు ఇస్తు మాజీ అధ్యక్షుడికి స్వాగతం చెప్పారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సోము వీర్రాజు నిప్పులపై ఉన్నట్టు సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదట. రెండు నెలల క్రితం వీర్రాజును ఉద్దేశించి కన్నా చేసిన వ్యాఖ్యలేనని చెబుతున్నారు. సోము వీర్రాజు వల్లే పార్టీ ఎదగడం లేదని.. మిత్రపక్షం జనసేనను సరిగా డీల్ చేయడం లేదని కన్నా ఆరోపించారు. ఆ వ్యవహారంపై సోము వీర్రాజు స్పందించలేదు. అంతా బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందని.. ఏం చేయాలో తనకు తెలుసని సమాధానం దాటవేశారు.
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కన్నా పర్యటనలో జిల్లా నేతల తీరుపై వీర్రాజు ఫైర్?
నెల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి కన్నాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంపై రెండు పార్టీల్లోనూ చర్చ సాగింది. నాదెండ్ల కన్నాను ఎందుకు కలిశారో బయటకు రాలేదు. ఆ భేటీపై కన్నా పార్టీ పెద్దలకు చెప్పారో లేదో తెలియదు. ఇంతలో కన్నా కాకినాడ జిల్లా పర్యటన తెరమీదకు వచ్చింది. రెండు రోజుల కిందట కాకినాడ జిల్లా బిజెపి పదాధికారుల సమావేశం జగ్గంపేటలో జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న వీర్రాజు.. కన్నా పర్యటనలో జిల్లా లీడర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని సీరియస్ అయ్యారట. ప్రైవేట్ కార్యక్రమంలో ఆ స్థాయిలో శృతి కలపడం అవసరమా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారట వీర్రాజు. ఒకవేళ మీకు గాని, కన్నాకు గాని బీజేపీపై అంత ప్రేమ ఉంటే ఒక పార్టీ కార్యక్రమం లేదా ప్రెస్‌మీట్ పెట్టించొచ్చు కదా అని చెప్పారట.
జిల్లా నేతలు ఒకరిద్దరు వీర్రాజుకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారట. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హోదాలో కన్నాను గౌరవించామని.. తమకు ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని అన్నారట. దాంతో వీర్రాజు మరింత రుసరసలాడినట్టు తెలుస్తోంది. మీరు చిన్నపిల్లలు కాదు. ‘పార్టీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏం తెలియనట్టు కథలు చెప్పొద్దు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారట వీర్రాజు. అక్కడితో ఊరుకుంటే పర్వాలేదు. ‘కన్నా పార్టీలో ఉంటారు లేదో.. మీకు తెలియదా’ అని వీర్రాజు ఎదురు ప్రశ్నించారట. ‘ఎవరి అజెండా ఏంటో అర్థం అవుతుంది కదా’ అని కస్సు బుస్సు లాడారట. కన్నా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాలో పదవులు చేపట్టిన నేతలు బీజేపీలో ఉంటారా పోతారా అని వీర్రాజు ఆరా తీశారట. పైగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు తన సొంత ఉమ్మడి జిల్లాలోనే ఇలా జరిగిందేంటా అని అగ్గి మీద గుగ్గిలం అయ్యారట వీర్రాజు. పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తున్నా.. గీత దాటి ఎందుకు ప్రవర్తించారు? కన్నాతో అంత రాసుకు పూసుకుని తిరగడం అవసరమా? అని వీర్రాజు ప్రశ్నించినట్టు టాక్ నడుస్తుంది. ఎవరైనా పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని.. పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెగేసి చెప్పేశారట వీర్రాజు.
తన సొంత జిల్లాలో కన్నాకు లభించిన ఆదరణపై వీర్రాజు కినుక?
మొత్తానికి సొంత జిల్లాలో కన్నాకు ఇచ్చిన ఆతిథ్యంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిందట సోము వీర్రాజు పరిస్థితి. ఇప్పటివరకు ఓపిక పట్టిన ఆయన ఒక్కసారిగా ఓపెన్ అయిననట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి మాజీ చీఫ్.. ప్రస్తుత చీఫ్ మధ్య రాజుకున్న ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!