Team India: సంజు శాంసన్‌కు గాయం.. రెండో టీ20కి దూరం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియాను వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. ఇటీవల కెప్టెన్ రోహిత్ కూడా గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా గాయపడ్డాడు. దీంతో గురువారం శ్రీలంకతో జరగబోయే రెండో టీ20కి అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ముంబైలోనే ఉన్నాడని.. రెండో మ్యాచ్ జరిగే పూణెకు వెళ్లలేదని సమాచారం అందుతోంది.
Read Also: Gautham Gambhir: ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. ఆటగాళ్లపై పనిభారం తగ్గించాలి
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
తొలి టీ20 సందర్భంగా సంజు శాంసన్ మోకాలి గాయానికి గురయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 13వ ఓవర్‌లో శాంసన్ గాయపడ్డాడు. మ్యాచ్ తర్వాత అతడికి స్కాన్‌లు నిర్వహించారు. వీటి ఫలితం కోసం అతడు ముంబైలోనే ఉండిపోయాడు. కాగా రాక రాక అవకాశం వస్తే సంజు శాంసన్ విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో మాజీ క్రికెటర్లు కూడా అతడిపై మండిపడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20లో సంజూ శాంసన్ ఔటైన తీరును సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడని సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ మెరుగైన ఆటగాడు అని.. అతనిలో చాలా టాలెంట్ ఉంది కానీ అతడి షాట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్‌గా లేదని.. అదే అతడిని బెంచ్ మీద కూర్చోబెడుతోందని గవాస్కర్ అన్నాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!