What’s Today:
* నేటి నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్.. వైద్యులతో వర్చువల్‌గా ప్రసంగించనున్న సీఎం జగన్.. హాజరుకానున్న 100 మంది విదేశీ, 450 మంది స్వదేశీ నిపుణులు.. వివిధ రకాల వ్యాధులు, వాటి చికిత్సా విధానంపై చర్చ.. తొలిరోజు సమావేశంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
* అమరావతి: నేడు వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
* నేడు కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. గుడుపల్లె మండలంలో పర్యటించనున్న చంద్రబాబు
* విశాఖ: నేటి నుంచి ప్రారంభం కానున్న ఆర్గానిక్ మేళా 2023.. సేంద్రీయ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సదస్సులు
* నేటి నుంచి మూడు రోజుల పాటు యానాంలో ప్రజా ఉత్సవాలు.. యానాం శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ ఆమరణ నిరాహారదీక్ష.. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా ఉత్సవాలు చేయడంపై నిరసన
* హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టులో విచారణ.. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ
* నేడు కామారెడ్డి బంద్‌కు రైతు జేఏసీ పిలుపు.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో రైతుల ధర్నా.. బంద్ సందర్భంగా పోలీసుల హై అలర్ట్
* నేడు కామారెడ్డి రైతుల ఆందోళనలో పాల్గొననున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
* నేడు ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం.. హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని సహా హాజరుకానున్న ప్రధాన తారాగణం