చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన సవార్కర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సవార్కర్ పేరు పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో అవతరించే విద్యల ఆలయానికి పెట్టాల్సిన పేరు ఇదేనా..? అంటూ మండిపడ్డారు.
Read Also: WhatsApp Location Trace: వాట్సాప్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేయకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే
సెక్యులర్ భావాలు, సర్వమత సమాధికారం అనేవి భారతసమాజపు విలువలకు వెన్నెముక వంటివి అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. వాటిని వ్యతిరేకించి ఉద్యమాలు చేసి, చివరకు మహాత్ముని హత్య కేసులో కూడా ఒక నిందితుడిగా అనుమానించబడ్డ సవార్కర్ పేరా సరస్వతీ నిలయానికి పెట్టాల్సిన పేరా..? అదేనా అంటూ ప్రశ్నించారు. చూసి చూడకుండా ఉంటే గాడ్సే పేరును కూడా ఏ విశ్వవిద్యాలయాలకో.. ఉన్నత సంస్థలకో కూడా పెట్టే అఘాయిత్యానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగలదని తీవ్ర స్థాయిలో సీపీఐ తరపున తమ వ్యతిరేకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Minister Seethakka: సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన మంత్రి..